
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై ఫుల్ ఫోకస్ పెట్టిన టీఆర్ఎస్ పార్టీకి అన్ని అనుకున్నట్టే కలిసివస్తున్నాయి.. స్వతహాగా కాంగ్రెస్ వాదిగా ఉంటూ వస్తున్న కాంగ్రెస్ నేత దానం నాగేందర్ కొంత కాలంగా కాంగ్రెస్ అధిష్టానంపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకపోవడం.. పార్టీలో సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఆయన కాంగ్రెస్ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.
దీంతో టీఆర్ఎస్ నాయకులు ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారు.మొన్నటికి మొన్న టీఆర్ఎస్ లో చేరనని ప్రకటించిన దానం.. రెండు మూడు రోజులు పరిణామాల నేపథ్యంలో మనసు మార్చుకున్నారట..
అసెంబ్లీ శాసనసభా సమావేశాలు ముగియగానే దానం నాగేందర్ తో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రభాకర్ టీఆర్ఎస్ లో చేరనున్నారు. ఈ మేరకు టీఆర్ఎస్ వర్గాలు ధ్రువీకరించాయి..