Breaking News

కాంగ్రెస్ ధర్నా గ్రాండ్ సక్సెస్

thotapal

కరీంనగర్ : కరీంనగర్ జిల్లా బెజ్జంకిలో రాజీవ్ రహదారిపై కాంగ్రెస్ చేపట్టిన మహాధర్నా గ్రాండ్ సక్సెస్ అయ్యింది. తోటపల్లి రిజర్వాయర్ రద్దు ప్రతిపాదనను విరమించుకొని ప్రాజెక్టును పూర్తి చేయాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, మాజీ మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే జీవన్ , కరీంనగర్ డీసీసీ ప్రెసిడెంట్ కటకం మృత్యుంజయం డిమాండ్ చేశారు.

ధర్నా ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగింది. జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున హాజరుకావడంతో ధర్నా విజయవంతమైంది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేశారు.

మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ , మాజీ ఎమ్మెల్యేలు ఆరేపల్లి మోహన్, అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి పాల్గొన్న ఈ ధర్నాలో డీసీసీ అధ్యక్షులు కటకం అన్నీ తానై ముందుండి ధర్నాను విజయవంతం చేశారు.

thotapally.jpg2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *