కాంగ్రెస్ డిపాజిట్లు గల్లంతు

కాంగ్రెస్ డిపాజిట్లు గల్లంతు

-పాలకుర్తి నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు గల్లంతవ్వడం ఖాయమని పాలకుర్తి నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ద్రోహులందరూ కలిసి దొంగళముఠాగా ఏర్పాడ్డారని, ఓట్ల కోసం వచ్చే మహాకూటమిని నమ్మొద్దని అన్నారు. ప్రధానంగా యువత ఓటు వారికి బుద్ది చెప్పాలన్నారు. కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలతో అనేక మందికి లబ్ధి చేకూరిందన్నారు. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్, రైతుబంధు, రైతుబీమా, పింఛన్లు, కంటి వెలుగు వంటి పథకాలను వివరించారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

errabelli dayakar rao 1     errabelli dayakar rao 2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *