కాంగ్రెస్, టీడీపీలే ముంచాయి..

kcr knr
కాంగ్రెస్, టీడీపీలే ముంచాయి..

కాంగ్రెస్, టీడీపీలే ముంచాయి..

 

తెలంగాణ ఏర్పడకముందు ఏపీ సమైక్య రాష్ట్రంలో గోదావరి కృష్ణ జలాలు, వాటి మీద ప్రాజెక్టుల విషయంలో గతంలో పాలించిన టీడీపీలు, కాంగ్రెస్ లు తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశాయని సీఎం కేసీఆర్ ఆరోపించారు. కరీంనగర్ కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మహారాష్ట్రపై చంద్రబాబు , కిరణ్ సీఎంలుగా ఉన్నప్పుడు 200 ప్రాజెక్టులు కట్టారని.. అప్పుడు వీరిద్దరు కళ్లున్నా చూడలేని గుడ్డివాళ్లుగా తెలంగాణకు అన్యాయం చేశారన్నారు. ఆ తర్వాత చంద్రబాబు బాబ్లీ ప్రాజెక్టు పై మహారాష్ట్ర వెళ్లి నానా హంగామా చేశాడని.. కానీ ఆయన చేసిన పాపం వల్లే ఈరోజు శ్రీరాంసాగర్ ఎండిపోయిందన్నారు.

గ్రేటర్ హైదరాబాద్ స్వచ్ఛ భారత్ కోసం 200 కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు. కరీంనగర్ జిల్లాలోని తోటపల్లి రిజర్వాయర్పై కాంగ్రెస్ నాయకులు మతిలేక ఆందోళన చేస్తున్నారని.. తోటపల్లి ప్రాజెక్టుపై ఇంజనీరింగ్ నిపుణులను డిజైన్ చేయాలని ఆదేశించామన్నారు. ప్రాణహిత కూడా భారీ ప్రాజెక్టుగా కట్టి తెలంగాణ సస్యశ్యామలం చేస్తామన్నారు. తెలంగాణ ప్రాజెక్టులు, వాటి నిర్మాణం, కాంగ్రెస్ , టీడీపీ చేసి అవినీతిపై కేసీఆర్ కరీంనగర్ ప్రెస్ మీట్ లో ధ్వజమెత్తారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *