కాంగ్రెస్ కు షాక్ ల మీద షాక్ లు

14-danam-nagendar-612

హైదరాబాద్ లో కాంగ్రెస్ కు దెబ్బమీద దెబ్బ తగిలింది.. ఆ పార్టీ నాయకులు ఉన్నవాళ్లు సైతం కాంగ్రెస్ లో కొనసాగడానికి ఇస్టపడడం లేదు..  గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ ప్రస్తుతం ఆ పదవికి రాజీనామా చేశాడు.. టీఆర్ఎస్ ధాటికి సింగిల్ డిజిట్ కే పరిమితమై అభ్యర్థులను గెలిపించుకోలేకపోవడంతో దానం అవమాన భారంతో రాజీనామా చేశాడు.. అసలు దానం నాగేందర్ చేసిన ఒక తప్పు ఆయన భవిష్యత్తును చీకటిచేసింది. అప్పట్లో డిసెంబర్ లో దానం టీఆర్ఎస్ లో చేరడం దాదాపు ఖాయమైంది. గ్రేటర్ లో టీఆర్ఎస్ అధ్యక్షుడిగా దానంను కేసీఆర్ ఆఫర్ చేశారు. దానం కూడా ఒప్పుకొని ఇక తెల్లారి టీఆర్ఎస్ కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యాడు.. కానీ చివరకు ఆయన కాంగ్రెస్ లోనే ఉండిపోయాడు.. కారణమేంటంటే కేసీఆర్ కండువా కప్పితేనే తాను టీఆర్ఎస్ లో చేరతానని దానం ప్రకటించాడు.. కానీ కేసీఆర్ నువ్వు టీఆర్ఎస్ సీనియర్ నేత కేశవరావు సమక్షంలో చేరు అని కేసీఆర్ చెప్పడంతో అలిగి కాంగ్రెస్ లోనే ఉండిపోయాడట దానం.. ఈ ఒక్క అసంబద్ద నిర్ణయం దానం ఆయన జీవితాన్నే మార్చివేసింది.. బ్యాడ్ లక్ దానం..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *