Breaking News

కాంగ్రెస్ కు ముందుంది ముసళ్ల పండుగ

kcr

ముందు మురిస్తే పండుగ కాదన్న సంగతిని మరిచిపోయారు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్గొండలో గెలవగానే కోమటిరెడ్డి సోదరులు, మహబూబ్ నగర్ లో గెలవగానే గద్వాల జేజమ్మ డీకే అరుణ తొడగొట్టి సవాల్ విసిరారు.. టీఆర్ఎస్ ను ఓడించామని గుణపాఠం తప్పదంటూ హెచ్చరించారు. కానీ వీరికి ఇంకా తత్వం బోధపడలేదని కాంగ్రెస్ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. సీఎం కేసీఆర్ యాగంలో ఉండబట్టి పట్టించుకోలేదు కానీ లేకపోతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసలు కాంగ్రెస్ ఖాతా తెరిచేకాదని టీఆర్ఎస్ నాయకులు లోలోపల మథన పడుతున్నారు..

రెండు గెలవగానే రెచ్చిపోయి తొడగొట్టిన కోమటిరెడ్డి బ్రదర్స్, డీకే అరుణ లాంటి కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ కాన్సన్ ట్రేట్ చేయలేదన్న విషయం తెలుసు.. కేసీఆర్ ఎంటర్ అయితే వార్ వన్ సైడ్ అవుతుంది. ఆయన బిజీగా ఉండడంతో నల్గొండ, మహబూబ్ నగర్ లో టీఆర్ఎస్ ఓడిపోయింది. లేదంటే ఫలితం మరోలా ఉండేది..కాంగ్రెస్ కు గుండా సున్నా మిగిలేదీ..

ఇక పోతే పోనీలే అని గులాబీ దళపతి గ్రేటర్ పీఠంపై కన్నేశాడు.. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులకు సవాల్ విసురుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గులాబీ దళపతి కేసీఆర్ పక్కా వ్యూహంతో పోతున్నారు. గ్రేటర్ పీఠం దక్కించుకోవడం..కాంగ్రెస్, టీడీపీలకు దెబ్బకొట్టడమే లక్ష్యంగా ముందుకుపోతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ లో గ్రేటర్ పోరు లో దానం నాగేందర్, ఇతరు నాయకులు వర్గాలుగా చీలిపోవడం టీఆర్ఎస్ కు లాభం అయ్యింది. దీంతో నల్గొండ, మహబూబ్ నగర్ లో గెలిచిన కాంగ్రెస్ కు ఇక్కడ గెలుపు అంతా ఈజీ కాదు. కోమటిరెడ్డి, డీకే అరుణల వల్లే అక్కడ నెగ్గారు తప్పితే పీసీసీ కాంగ్రెస్ వల్ల కాదనేది బహిరంగ రహస్యమే..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *