Breaking News

కాంగ్రెస్ కు ఇప్పుడు మరో వైఎస్ కావాలి..

CN3eAQGU8AAH536

ఓరుగల్లు ఉప ఎన్నికల పోరులో కాంగ్రెస్ కు డిపాజిట్ కూడా దక్కకపోవడానికి కారణం ఎవరూ.. జానారెడ్డి అన్నట్టు ఇది ప్రజల బాధ్యతా.? లేక నాయకత్వ లోపమా..? ముమ్మాటికీ కాంగ్రెస్ కు ఇప్పుడు నడిపించే నాయకుడు కావలెను.. ఢిల్లీని ఏలిన నాయకులు వచ్చి ప్రచారం చేసినా గెలవలేదంటే కాంగ్రెస్ కు ఇప్పుడు నాయకత్వ సామర్థ్యం .. జనాకర్షక నేతలోటు అన్న సంగతి తేటతెల్లం అవుతుంది. వైఎస్ లాంటి అన్నీ తానై ముందుండి పార్టీని నడిపించే నాయకుడి కోసం కాంగ్రెస్ నాయకత్వం ఆశగా ఎదురుచూస్తోంది..

ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వైఎస్ లా తన వ్యూహాలు మార్చుకోవాలని.. అప్పుడే తెలంగాణలో కాంగ్రెస్ బతికి బట్టకడుతుందని కార్యకర్తలు భావిస్తున్నారు.

ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు పునసమీక్షించుకోవాలి.. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల వరకు పార్టీని బలోపేతం చేయాలి. పీసీసీ చీఫ్, ఇతర నాయకులు ఉమ్మడిగా కదిలాలి. జనంలో మమేకమయ్యేలా తిరగాలి.. అప్పుడే హైదరాబాద్ లో విజయం తథ్యం.. లేకుంటే మళ్లీ హైదరాబాద్ లో కూడా బలం లేని టీఆర్ఎస్ పాగా వేస్తుంది.. తస్మాత్ జాగ్రత్త కాంగ్రెస్ నాయకుల్లారా..? ప్రతిపక్షం పాత్రను పోషించడం దిగ్విజయం కండి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *