కళ తప్పిన రేవంత్ రెడ్డి మోము..

హైదరాబాద్ లోని ఎన్ కన్వేన్షన్ సెంటర్ లో జరుగుతున్న రేవంత్ రెడ్డి కుమార్తె నిశ్చితార్థం కోలాహలంగా జరుగుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు , సీనియర్ నేతలు ఎర్రబెల్లి, మోత్కుపల్లి, ఏపీ నేతలు మంత్రులు, ఎంపీలు అందరూ వచ్చి రేవంత్ కు సపోర్టుగా ఫంక్షన్ వచ్చి సంఘీభావం తెలిపారు.

కాగా ఓటుకు నోటు కేసులో ఇరుక్కొని కూతురు నిశ్చితార్థం కోసం 12 గంటల బెయిల్ పొందిన రేవంత్ మొహంలో ఏమాత్రం సంతోషం లేకుండా ఉంది. కళ తప్పింది. ఏపీ సీఎం చంద్రబాబుతో ముభావంగానే మాట్లాడారు. ఎవరితోనూ మునుపటిలా కలుపుగోలుగా లేడు.. కూతురు, పిల్లలను మనసారా హత్తుకుంటూ కనిపించాడు. ఆయన మొహంలో అరెస్ట్ , కేసు భయం స్పష్టం గా కనపడుతోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *