Breaking News

కళ్యాణ్ రామ్ హీరోగా దిల్ రాజు మూవీ

Kalyan-Ram

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా దిల్ రాజు ఒక మూవీ నిర్మిస్తున్నారు. పిల్లా నువ్వు లేని జీవితం, సౌఖ్యం మూవీల దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు.. ఈ మేరకు సినిమాకు పచ్చాజెండా ఊపారు దిల్ రాజు, కళ్యాన్ రామ్..చాలా రోజులుగా ప్లాప్ లతో ఖాళీగా ఉన్న దర్శకుడు రవికుమార్ చౌదరితో దిల్ రాజు జతకట్టడం సంచలనంగా మారింది. నందమూరి కళ్యాణ్ రామ్, దిల్ రాజులు సైతం హిట్ లు లేక మొహం వాచిపోయి ఉన్నారు. ఈ నేపథ్యంలో ముగ్గురు ప్లాప్ లు పొందిన వారు కలిసి వండుతున్న ఈ సినిమాపై మీడియాలో అందరి దృష్టి కేంద్రీకృతమైంది..
ప్రస్తుతం కళ్యాన్ రామ్ పూరి జగన్నాత్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమా పూర్తయిన తరువాత దిల్ రాజు బ్యానర్ లో సినిమాను కళ్యాన్ రామ్ చేస్తారు. ఇప్పటికైనా వీరి ముగ్గురి దశ తిరిగి ఫాంలోకి వస్తారో లేదో చూడాలి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *