కళాకారులతో కేసీఆర్..

హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు.. ప్రజల్లోకి వెళ్లలేదు. రేషన్ కార్డుల, పింఛన్లు, అమరులకు రివార్డులైతే ఎంతో వివాదాస్పదం అయ్యాయి. ప్రతిపక్షాలు, పేపరోళ్లకు అయాచితంగా దొరికాయి. ఇంకేముంది టీఆర్ఎస్ ను ఎంత బ్లేమ్ చేయాలో అంతా చేసేశారు. దీంతో సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే మంగళవారం తెలంగాణలోని పేరు మోసిన కళాకారులతో సమావేశమయ్యారు.

తెలంగాణ సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్, పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ, గోరేటి వెంకన్న, జయరాజు, దేశపతి శ్రీనివాస్, కోదాటి శ్రీను, మిట్టపల్లి సురేందర్, వరంగల్ శ్రీను, తిరుపతి, యశ్ పాల్, సంచాలకులు హరికృష్ణ తదితరులతో కేసీఆర్ తన నివాసంలో భేటి అయ్యి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పాటలు రాయలని కోరారు. కళాకారులు నియోజకవర్గాల్లోకి వెళ్లి వాటిని ప్రచారం చేయాలని సూచించారు. కాగా తాను ఒక పాట రాస్తానని చెప్పారు. ఈ కళారూపాలు, పాటలను ప్రజలకు చేరువ చేయాలని సూచించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *