కల్వకుర్తి ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాది కొత్తగా లక్ష ఎకరాలకు సాగు నీరు: మంత్రి హరీష్ రావు

కల్వకుర్తి ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాది కొత్తగా లక్ష ఎకరాలకు సాగు నీరు: మంత్రి హరీష్ రావు

దిండి, పాలమూరు, కాళేశ్వరం ప్రాజెక్టులకు సంబంధించి ఆర్ అండ్ ఆర్ పనులు పూర్తి చేయాలి.

ఇళ్లు కోల్పోయిన వారికి 2013 ఆర్ అండ్ ఆర్ యాక్ట్ కన్నా మెరుగైన పునరావాస ప్యాకేజి అందించాలి.

కల్వకుర్తి ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాది కొత్తగా లక్ష ఎకరాలకు సాగు నీరు.

సిద్దిపేట, సూర్యపేట, రాజన్న సిరిసిల్ల, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్లతో మంత్రి హరీశ్ రావు

వీడియో కాన్ఫరెన్స్.

దిండి, పాలమూరు, కాళేశ్వరం ప్రాజెక్టులకు సంబంధి సహాయ, పునారావాస చర్యలు వేగవంతం చేయాలని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ఆయా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈరోజు సచివాలయంలో సిద్దిపేట, సూర్యపేట, రాజన్న సిరిసిల్ల, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో సీఎస్ శైలేంద్ర కుమార్ జోషి, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, కాళేశ్వరం ప్రాజెక్టు ఈ.ఎన్. సీ హరిరామ్, ఇరిగేషన్ ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే పాల్గొన్నారు. దిండి, పాలమూరు, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన భూసేకరణ పనులు వేగవంతం చేయాలని మంత్రి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. దీంతో పాటు మెరుగైన పునరావాస ప్యాకేజీని అందించాలని సూచించారు. 2013 ఆర్ అండ్ ఆర్ యాక్ట్ కన్నా మిన్నగా ప్రాజెక్టులో ఇళ్లు, ఆస్థులు కోల్పోయిన వారికి పునరావాస ప్యాకేజీ ఉండాలన్నారు. మల్లన్న సాగర్, కొండ పోచమ్మ, అనంతగిరి, రంగనాయక సాగర్, మేడారం రిజర్వాయర్ల పరిధిలో భూసేకరణ పనులు పూర్తి చేయాలని, వీటి కింద ఇళ్లు కోల్పోయిన వారికి మెరుగైన సహాయా పునరావాస కార్యక్రమాలు వెంటనే చేపట్టాలని ఆదేశించారు. పరిహారం నిమిత్తం ఇప్పటికే విడుదల చేసిన నిధులను భూములు, ఇళ్లు, ఆస్థులు కోల్పోయిన వారికి వెంటనే చెల్లించాలన్నారు.

కల్వకుర్తి ప్రాజెక్టు ద్వారా కొత్తగా లక్ష ఎకరాలకు నీరు

కల్వకుర్తి ప్రాజెక్టు ద్వారా గత ఏడాది రెండున్నర లక్షల ఎకరాలకు సాగు నీరు ఇచ్చామని, ఈ ఏడాది కొత్తగా మరో లక్ష ఎకరాల ఆయకట్టుకు నీరు ఇస్తామని మంత్రి హరీష్ రావు చెప్పారు. ఈ ఏడాది 3 లక్షల 60 వేల ఎకరాలకు నీరిచ్చేలా.. తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ ను మంత్రి ఆదేశించారు. కల్వకుర్తి పరిధిలో భూసేకరణ పనులు పూర్తి చేయాలన్నారు. ఇందుకు అవసరమైన 13 కోట్ల రూపాయలను రెండు, మూడు రోజుల్లో విడుదల చేయనున్నట్లు మంత్రి చెప్పారు. మూసీ ప్రాజెక్టు కింద సైతం ఈ ఏడాది కొత్తగా 26 వేల ఎకరాలకు సాగు నీరు ఇస్తున్నామని అందుకు సంబంధిచిన ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఈ నెల 15వ తేదీ లోగా ఆయకట్టుకు నీటిని విడుదల చేసేలా చూడాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ను మంత్రి ఆదేశించారు.

harish rao vedio conference

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *