Breaking News

కల్వకుర్తి ప్రాజెక్టు కింద పెండింగ్ లో ఉన్నపనులు పూర్తి చేయాలి – మంత్రి హరీశ్ రావు సమీక్ష

కల్వకుర్తి ప్రాజెక్టు కింద పెండింగ్ లో ఉన్నపనులు పూర్తి చేయాలి - మంత్రి హరీశ్ రావు సమీక్ష

వచ్చే వానాకాలానికి పెండింగ్ పనులు పూర్తి చేయాలి.

అవసరమైతే ఏజెన్సీ ని మార్చాలి.

నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గంలో పూర్తి ఆయకట్టుకు నీరు.

కల్వకుర్తి పై మంత్రి హరీశ్ రావు సమీక్ష.

కల్వకుర్తి ప్రాజెక్టు కింద పెండింగ్ లో ఉన్న పనులన్నింటినీ వచ్చే వానాకాలం నాటికి పూర్తి చేయాలని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. శనివారం ఇక్కడ జలసౌధ లో నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న కల్వకుర్తి పనులను మంత్రి సమీక్షించారు.నాగర్ కర్నూల్ శాసన సభ్యుడు మర్రి జనార్ధన రెడ్డి ఇటీవల జరిపిన జలవిజయ యాత్ర సందర్భంగా వచ్చిన విజ్ఞప్తులను మంత్రి పరిశీలించారు. దాదాపు 60 కి పైగా వచ్చిన వివిధ విజ్ఞప్తులపై వెంటనే స్పందించి వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని హరీశ్ రావు కోరారు.తెల్కపల్లి మండలం లక్నారమ్ గ్రామం నుంచి ఏం.ఎల్.ఏ పాదయాత్ర జరిపారు.నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని నాగర్ కర్నూల్, బిజినేపల్లి, తిమ్మాజిపేట, తాడూరు,తెల్కపల్లి మండలాల్లో కల్వకుర్తి ప్యాకేజీ 29, 30 ల పనుల పురోగతి మంత్రి సమీక్షించారు.2016_2017 లో మొత్తం కల్వకుర్తి కింద 280 చెరువులు నింపగా, ఈ ఏడాది 350 చెరువులు నింపినట్టు అధికారులు మంత్రికి తెలిపారు.

ఇందులో నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో 120 చెరువులు నింపినట్టు వారు చెప్పారు.కల్వకుర్తి కింద మొత్తం ఆయకట్టు 4.25 లక్షల ఎకరాలు కాగా గత ఏడాది 1.25 లక్షల ఏకరాలకు సాగు నీరు అందించామని, ఈ ఏడాది యాసంగి లో 2 లక్షల ఎకరాలకు సాగునీటిని సరఫరా చేసినట్టు ఇరిగేషన్ అధికారులు చెప్పారు.29,30 ప్యాకేజీ లలో మిగిలిపోయిన డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ పనులు వచ్చే వానాకాలం నాటికి పూర్తి చేయాలని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. ఒప్పందం ప్రకారం గడువులోపు ఈ పనులు చేయని పక్షంలో నిబంధనల ప్రకారం సమబంధిత ఏజన్సీ ని తొలగించి వేరే ఏజన్సీ తో పనులు చేయించాలని ఆయన ఆదేశించారు. వెంటనే ఏజన్సీ ని పిలిపించి మాట్లాడాలని కోరారు. కల్వకుర్తి మెయిన్ కెనాల్ సహా డిస్ట్రి బ్యూటరీల కింద మిగిలిన పనులన్నింటినీ ఖరీఫ్ కల్లా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.

ఈ సమీక్షా సమావేశం లో ఏం.ఎల్.ఏ మర్రి జనార్ధన్ రెడ్డి, మహబూబ్ నగర్ సి.ఈ. ఖగేందర్ రావు, ఎస్.ఈ.భద్రయ్య,జడ్.పి.టి.సి,ఏం.పి.టి.సి.లు, సర్పంచులు, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు,రైతులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *