
నిజామాబాద్ లో కల్తీ కల్లు పలువురి ప్రాణాలు తీస్తోంది. ఇన్నాళ్లు ఆ కల్లు తాగిన మందుబాబులకు ఇప్పుడు కల్లు దొరకడం లేదు.. ఎక్సైజ్ అధికారులు కల్తీ కల్లును నిషేధించడంతో ఇప్పుడు కల్లు అమ్మకాలు నిలిచిపోయాయి. దీంతో కల్లు దొరకక చాలా మందికి పిచ్చిపట్టింది. పిచ్చిపిచ్చిగా ప్రవర్తించి గాయాలు చేసుకుంటున్నారు. పరిస్థితి దారుణంగా తయారవడంతో దాదాపు 30 మంది నిజామాబాద్ ఆస్పత్రి పాలయ్యారు.
కాగా రెండు రోజుల క్రితం కల్లు దొరకలేదని.. ఓ వ్యక్తి కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఈరోజు మృతిచెందాడు.. కల్లు దొరకక ఆస్పత్రిపాలైన మరో వ్యక్తి ఇవాళ నిజామాబాద్ లో చనిపోయారు..