Breaking News

మరమ్మత్తు పనులు వేగవంతంగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్

కలెక్టర్ మరమ్మత్తు పనులు వేగవంతం పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్

కరీంనగర్: కలెక్టర్ మరమ్మత్తు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ ఆదేశించారు. సోమవారం కలెక్టర్ లో జరుగుచున్న మరమ్మత్తు పనులను కలెక్టర్ పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మరమ్మత్తు పనులు నత్తనడకన సాగుచున్నాయని ఎక్కువ మందిని పెట్టి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు. మరమ్మత్తులకు సంబంధిత బ్లాకుల అధికారులు సహకరించకుంటే జిల్లా రెవెన్యూ అధికారికి తెలపాలని వెంటనే అధికారులతో మాట్లాడి సమన్వయ పరుస్తారని అన్నారు. అధికారులు ఎసిలను సజ్జలపై నుండి తొలగించాలని లేకుంటే మరమ్మత్తులకు అంతరాయం ఏర్పడుతుందని అన్నారు. మరమ్మత్తు పనుల ప్రగతిని ప్రతిరోజు తమకు తెలపాలని ఆదేశించారు. ప్రతిరోజు పనులను పర్యవేక్షించాలని జిల్లా రెవిన్యూ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి వీరబ్రహ్మయ్య, కలెక్టర్ మరమ్మత్తుల సాంకేతిక సలహదారు రాజేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *