
పాలేరు విజయం టీఆర్ఎస్ పై మరింత బాధ్యతను పెంచిందని కేసీఆర్ అన్నారు. పాలేరు లో టీఆర్ఎస్ ఘనవిజయం అనంతరం కేసీఆర్ విలేకరులతో మాట్లాడారు. ప్రజలు టీఆర్ఎస్ రెండేళ్ల పాలనకు రెఫరెండంలా తీర్పు నిచ్చారని తెలిపారు. దేశంలోనే సంక్షేమంలో నెంబర్ 1 రాష్ట్రం అని కేంద్రం, వివిధ రాష్ట్రాలు మెచ్చుకుంటున్నాయని తెలిపారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలేరు ఎన్నికల్లో కుట్రలకు పాల్పడిందని చెప్పారు. ఢిల్లీకి పోయి ఖమ్మం కలెక్టర్ ను మార్చారని.. ఎస్పీని మార్చారని.. ఎన్నికల అధికారులను మార్చారని ఆరోపించారు. ఓటింగ్ మిషన్లకు స్లిప్ లు పెట్టినా కూడా టీఆర్ఎస్ ను గెలిపించారంటే మా పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవాలని సూచించారు..
ఇప్పటికైనా టీఆర్ఎస్ పై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు. ఎన్నో సమస్యలున్నా ఇండియాలోనే గొప్ప రాష్ట్రంగా మార్చామని కేసీఆర్ చెప్పారు..