
కరీంనగర్: కలెక్టరేటులో జరుగుతున్న మరమ్మత్తు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ అన్నారు సోమవారం కలెక్టరేటులో జరుగుచున్న మరమ్మత్తు పనులను కలెక్టర్ పరిశీలించారు. కలెక్టరేటులోని టాయిలెట్ బాక్స్ ను పూర్తిస్ధాయిలో మరమ్మత్తు పూర్తి చేయాలని ఆదేశించారు. చెడిపోయిన వాటిని తొలగించి కొత్తవి అమర్చాలని అన్నారు. డి.టి.ఓ. వద్ద ఉన్న పాత పార్టీషన్ ను తొలగించాలని అన్నారు. అలాగే మెట్ల వద్ద గల క్యాంటిన్ తొలగించాలని ఆదేశించారు. గోడలపై ఎలాంటి పోస్టర్లు అంటించరాదని అన్నారు. మరమ్మత్తులలో కలెక్టరేటు మరో నాలుగు కాలాల పాటు కొనసాగే మరమ్మత్తులు చేయాలని అన్నారు కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ పౌసమి బసు, పనుల పర్యవేక్షకులు రాజేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.