కలుగులో ఎలుక బోనుకు..

maxresdefault

రేవంత్ రెడ్డికి బెయిల్ రావడంతో రెట్టించిన ఉత్సాహంతో ఉన్న టీడీపీ శ్రేణులకు టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అరెస్ట్ తో దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది తెలంగాణ ఏసీబీ. రేవంత్ బెయిల్ .. నెల రోజులుగా స్తబ్దుగా ఉన్న విచారణతో ఇక తమకేం కాదన్నట్టు గా చెలరేగిపోయారు తెలుగు తమ్ముళ్లు.. అందుకే రేవంత్ విడుదలను పండుగలా చేసుకున్నారు. ఆ పండుగ మూన్నాళ్ల ముచ్చటే అయ్యింది.

రేవంత్ విడుదల కావడంతో ఇన్నాళ్లు కలుగు(ఆంధ్ర)లో దాక్కొని దోబూచులాడిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆయన సైతం ఊహించని పరిణామానికి గురయ్యారు. తెలంగాణ ఏసీబీ తన వద్ద సాక్ష్యాలు లేవంటూ ప్రచారం చేసి వలపన్ని సండ్రనే తమకు వద్దకు వచ్చేలా ప్రేరేపించి తెలివిగా అరెస్ట్ చేసింది.

ఈ దెబ్బతో టీడీపీలో మరోసారి అంతర్మథనం మొదలైంది. విచారణ వచ్చిన వేం నరేందర్ రెడ్డిని కూడా రెండు రోజుల్లో ఏసీబీ అరెస్ట్ చేస్తుందని.. పారిపోయిన జిమ్మి బాబు ను కూడా లోపలేస్తుందనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది..

దీంతో ఇన్నాళ్లు సైలెంట్ అయిన ఏసీబీ  సండ్ర అరెస్ట్ తో మళ్లీ టీడీపీకి గుబులు పుట్టిస్తోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *