కలిసికట్టుగా పని చేయాలి

కలిసికట్టుగా పని చేయాలి

-టీఆర్ఎస్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ
ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపునకు నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలని పార్టీ రామగుండం అభ్యర్థి సోమారపు సత్యనారాయణ అన్నారు. అంతర్గాం మండలంలోని పొట్యాల గ్రామంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయానికి నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని, నాయకులు కార్యకర్తలు అందరు కలిసి కట్టుగా ప్రచారం చేయాలని సూచించారు. ప్రతిపక్షాలకు ఓటడిగే హక్కు లేదని, ఎన్నికల్లో వారి డిపాజిట్లు గల్లంతవడం ఖాయమని అన్నారు. నియోజకవర్గంలోని సబ్బండ వర్గాలు తనకు మద్దతు తెలుపుతున్నాయని, భారీ మెజార్టీతో గెలిపిస్తారని తెలిపారు. కుల వృత్తులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిచ్చిందని, అన్ని కుల సంఘాలు టీఆర్ఎస్ కు మద్దతుగా కదిలి వస్తున్నాయని అన్నారు. పార్టీ కోసం పని చేసే ప్రతీ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని తెలిపారు. పార్టీలో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు. తనను నమ్ముకున్న కుటుంబాలను తప్పకుండా ఆదుకుంటానని భరోసా కల్పించారు. నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములయ్యేందుకు ప్రతీ ఒక్కరు కారు గుర్తుకే ఓటేయ్యాలని కోరారు.

somarapu satyanarayana 1     somarapu satyanarayana 2    somarapu satyanarayana 3

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *