కలం యోధుడికి కన్నీటి వీడ్కోలు

కలం యోధుడు కరుణాకర్ రెడ్డికి తన స్వగ్రామమైన పల్లె పహాడులో ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు. ఆదివారం హైదరాబాదులోని ప్రయివేటు ఆసుపత్రిలో మృతి చెందిన కరుణాకర్ రెడ్డకి తన స్వగ్రామమైన నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం పల్లెపహాడులో సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు అంతిమ యాత్ర జరిగింది. కరుణాకర్ రెడ్డి ఐజెయూ నాయకులు, మన తెలంగాణ ఎడిటర్ కె శ్రీనివాస రెడ్డికి సోదరుడు. కరుణాకర్‌రెడ్డి మరణం పట్ల ఐజెయూ సెక్రటరీ జనరల్‌ దేవులపల్లి అమర్‌, ఐజెయూ కార్యదర్శి వై నరేందర్ రెడ్డి, దేవరకొండ ఎంఎల్ఎ రవీంద్ర నాయక్, నకిరేకల్ ఎంఎల్ఎ వేముల వీరేశం, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు నగునూరి శేఖర్‌, విరహత్‌ అలీ, ఐజేయూ నాయకులు కే.అమర్ నాథ్, కే. సత్యనారాయణ, అంబటి ఆంజనేయులు, దాసరి కృష్ణారెడ్డి, తెలంగాణ ఆన్ లైన్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ అద్యక్షులు అయిలు రమేశ్, ఏపీయూడబ్ల్యూజే అధ్యక్ష కార్యదర్శులు నల్లి ధర్మారావు, ఐవి.సుబ్బారావు,  టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు తాడూరి కరుణాకర్, దొంతు రమేశ్, కోశాధికారి వై మహిపాల్ రెడ్డి  జర్నలిస్ట్ యూనియన్ నాయకులు ఆలపాటి సురేష్ కుమార్ ఎంఏ మాజిద్, ఏ రాజేశ్, సంపత్ కుమార్,  కోటిరెడ్డి, వెలిచాల చంద్రశేఖర్, అంగిరేకుల సాయిలు, కే. రాంనారాయణ,  టోంజా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, ఉపాధ్యక్షులు శ్యాంమోహన్ , కోశాధికారి కళ్యాణం శ్రీనివాస్, సిపిఐ నాయకులు చల్లా వెంకట రెడ్డి, మల్లెపల్లి యాదిరెడ్డి, స్థానికి ఎంపిపి మల్లిఖార్జున్ రెడ్డి, జడ్పిటిసి సభ్యులు దూదిమెట్ల సత్తయ్య  తదితరులు తీవ్ర సంతాపం తెలిపారు.

DSC_0272 DSC_0313 DSC_0451 DSC_0507

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *