
కర్ణాటకలో రెండు రోజుల క్రితం ఒక ఐపీఎస్ అనుమానాస్పద స్థితిలో ఉరేసుకొని చనిపోయిన సంగతి తెలిసిందే.. కాగా భూ అక్రమాలపై ఉక్కపాదం మోపిన ఆయనను కబ్జాకోరులు, కొందరు రాజకీయ నేతలే పొట్టనపెట్టుకున్నారని ఐపీఎస్ భార్య, పలువురు పోలీసులు ఆరోపించారు. ఐపీఎస్ మృతదేహంతో ఆయన భార్య, కుటుంబసభ్యులు ధర్నా చేశారు కూడా.. కాగా ఐపీఎస్ రవి మృతదేహం వద్ద ఆయన పెంచుకున్న కుక్క సైతం ఏడవడం అందరినీ కంటతడి పెట్టించింది.
కాగా ఈ వివాదంపై కర్ణాటక అసెంబ్లీ అట్టుడికి పోయింది. అధికార పక్ష నాయకులే ఈ హత్య చేయించారని విపక్ష సభ్యులు ఆరోపించారు. ముమ్మాటికీ ఇది రియల్ ఎస్టేట్ మాఫియా, కొందరు నాయకులు స్టిక్ట్ ఆపీసరును పొట్టనపెట్టుకున్నారని అసెంబ్లీలో గొడవకు దిగారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.