Breaking News

కరువుతో నష్టపోయాం.. ఆదుకోండి

t-jeevan-reddy

కరీంనగర్ : జిల్లాలో కరువు కరాళ నృత్యం చేస్తోందని.. దయచేసి జిల్లా అంతటిని కరువుగా పరిగణలోకి తీసుకొని భారీగా కేంద్ర సాయం చేసి ఆదుకోవాలని జగిత్యాల ఎమ్మెల్యే టి. జీవన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ అధికారులకు విన్నవించారు. కరువు తీవ్రత తెలుసుకోవడానికి వచ్చిన కేంద్ర కరువు బృందానికి ఈ మేరకు జీవన్ రెడ్డి వినతిపత్రం అందజేశారు.

కరీంనగర్ జిల్లాలోని బెజ్జంకి, హుస్నాబాద్, భీమదేవరపల్లి తిమ్మాపూర్ తదితర మండలాల్లో కేంద్ర కరువు బృందం పర్యటించింది. ఈ సందర్భంగా రైతులు వాళ్లా కాళ్ల వేల్లా పడి అప్పుల పాలై పోయాం.. ఆదుకోండని వేడుకున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే కూడా కరువు తీవ్రత దృష్ట్యా పెద్ద ఎత్తున సాయం చేయాలని కేంద్ర అధికారులకు విన్నవించారు.

ఈ కార్యక్రమంలో కరీంనగర్ కలెక్టర్ నీతూ ప్రసాద్, టీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *