కరీంనగర్ లో హౌజ్ వైఫ్ చిన్న సినిమా షూటింగ్ ప్రారంభం

ఆధ్య- నిక్షిత క్రియేషన్స్ బ్యానర్ పై కల్యాణం శ్రీనివాస్, లక్ష్మీ, సౌమ్య హీరో, హీరోయిన్ లు గా అయిలు రమేష్ నిర్మిస్తున్న ” హౌస్ వైఫ్ ” చిన్న సినిమా షూటింగ్ ను కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తుల ఉమ శనివారం నాడు క్లాప్ కొట్టి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘము రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్ తొలిపూజ నిర్వహించగా ,కరీం నగర్ ఫిల్మ్ సొసైటీ కార్యదర్శి పొన్నం రవిచంద్ర కెమెరా స్విచ్చాన్ చేయగా, తొలి సన్నివేశానికి కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యులు వారాల ఆనంద్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వై.సునీల్ రావు , చొప్పరి జయశ్రీ, ప్రముఖ వ్యాఖ్యాత మాడిశెట్టి గోపాల్ ,తెలంగాణవర్కింగ్ జర్నలిస్టుల సంఘము జిల్లా అధ్యక్షుడు తాడూరు కరుణాకర్, సీనియర్ జర్నలిస్ట్ గడ్డం రాజిరెడ్డి ,పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్సింగ్ ,రచయితలు అన్నవరం దేవేందర్ , ఓడనాల కిషన్ తదితరులు హాజరయ్యారు ఈ హౌస్ వైఫ్ చిత్రంలో ముత్తోజు రాజు, జారతి మధు,చైత్ర,అనురిద్, సిరిపురం సుశాంత్ ,భావన శ్రీనివాస్ ,సురేష్ శ్రీనివాస్ తదితరులు నటిస్తున్నారు. కెమెరా: చిందం శ్రీనివాస్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ :ముత్తోజు రాజు, అసిస్టెంట్ డైరెక్టర్ అఖిల్ కునూరు, కో డైరెక్టర్ అరవింద్, కథ, మాటలు, స్క్రీన్ ప్లే , దర్శకత్వం: అయిలు రమేష్                 IMG20180127100533IIMG20180127100614IMG20180127100445IMG20180127100421U

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *