కరీంనగర్ లో షీ టీంలు.. జర జాగ్రత్త

తెలిసో తెలియకో.. అమ్మాయిలు కనపడగానే ‘అరె సూపర్ ఫిగర్ రా..’ అని కామెంట్లు తరచుగా అంటుంటారు యూత్.. బస్టాండ్ , రద్దీ గల ప్రాంతాల్లో మరీ పెచ్చుమీరిపోతాయి ఈ కామెంట్లు.. కేసీఆర్ సర్కారు తెచ్చిన షీం పోలీసు టీంల వ్యవస్థతో ఇది కొంత వరకు తగ్గిపోయింది. ఇప్పుడు హైదరాబాద్ లోని మొదలైన షీ టీంల వ్యవస్థ జిల్లా, పట్టణాలకు విస్తరించింది.

కరీంనగర్ లో పోలీసులు షీం టీంలు ఏర్పాటు చేశారు.  బస్టాండ్ లో ఇటీవల నోరు జారిన ఓ ఉపాద్యాయుడుతో పాటు కొందరు మంచిస్థానాల్లో ఉన్న వ్యక్తులను అమ్మాయిలను కామెంట్ చేసినందుకు పోలీస్ స్టేషన్ కు పట్టుకెళ్లి తమ తడాఖా చూపించి అరెస్ట్ చేశారు. అమ్మాయిలపై కామెంట్లు చేసే వారిలో ఉన్నత చదువులు చదివిన వారుండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అందుకే ఇక నుంచి బస్టాండ్ లలో ఇంకా ఎక్కడైనా అమ్మాయిలను కామెంట్లు చేశారో .. మీకు అదే గతి పడుతుంది. జర జాగ్రత్త మరి..

ఇక మహిళల కోసం తెలంగాణ పోలీస్ శాఖ 181 అనే టోల్ ఫ్రీ నంబర్ ను తీసుకొచ్చింది. ఎవరైనా టీజింగ్ చేస్తే ఫోన్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *