కరీంనగర్ లో మహిళపై ముగ్గురి అత్యాచారం

కరీంనగర్ పట్టణంలో కూలీ నాలీ చేసుకునే ఓ మహిళపై  ముగ్గురు కామాంధులు మత్తు మందు ఇచ్చి సామూహిక అత్యాచారం చేశారు. కరీంనగర్ శివారు గ్రామంలో మేస్త్రీ దగ్గర కూలీ పనికి వెళ్లిన మహిళపై ఆ ఇంటి యజమానికి మత్తుమందు కలిపిన మద్యం తాగించాడు. మద్యం పార్టీ అంటూ కూలీలకు పార్టీ ఇచ్చిన యజమానికి ఈ మహిళకు మాత్రం మందు కలిపిన మద్యం ఇచ్చి సృహ తప్పిన తర్వాత కరీంనగర్ లోని లక్ష్మీనగర్ లోని పాత ఇంటికి తీసుకొచ్చాడు. అక్కడ అత్యాచారం చేసి,, అనంతరం తన ఇద్దరు స్నేహితులకు కూడా ఫోన్ చేసి రమ్మని అత్యాచారం జరిపారు. రాత్రి 7 గంటలనుంచి 1 గంట వరకు మహిళను అత్యాచారం జరిపారు. అనంతరం మహిళ కమాన్ వద్ద వదిలేశారు. తేరుకున్న బాధితురాలు కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *