కరీంనగర్ లో నేడు సబ్ ఎడిటర్ల సమావేశం

sakshi3

కరీంనగర్ : వివిధ పత్రికల్లో పనిచేస్తున్న సబ్ ఎడిటర్లందరూ ఏకమవుతున్నారు.. గత రెండు సమావేశాల్లో సాదక బాధకాలు.. హక్కుల కోసం మాట్లాడుకున్న నమస్తే తెలంగాణ, సాక్షి, ఆంధ్రజ్యోతి, వార్త, ఆంధ్రప్రభ తదితర పత్రికల సబ్ ఎడిటర్లు మంగళవారం (12జనవరి 16) మరో సారి సమావేశమవుతున్నారు. ఈ సమావేశంలో సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఒక కమిటీ ఎన్నుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందుకోసం అన్ని పత్రికల నుంచి సబ్ ఎడిటర్లు మంగళవారం తప్పకుండా హాజరు కావాలని ప్రచారం నిర్వహించారు..

కరీంనగర్ శివారు ఉజ్వల పార్క్ సమీప యాదవ భవన్ లో నిర్వహించే ఈ కార్యక్రమానికి కరీంనగర్ కేంద్రంగా పనిచేస్తున్న అన్ని పత్రికల్లోని సబ్ ఎడిటర్లు రావాలని నిర్వాహకులు కోరారు. ఈసారి వచ్చే సబ్ ఎడిటర్లతో కమిటీని రూపొందించి ప్రభుత్వానికి సమస్యలు నివేదించాలని భావిస్తున్నారు. తద్వారా సబ్ ఎడిటర్లందరికీ అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డులు, ఇళ్లస్థలాల్లో న్యాయం చేయాలని కోరనున్నారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *