కరీంనగర్ లో నేడు పాత్రికేయులతో అల్లం నారాయణ సమావేశం

టీయూడబ్ల్యూజే (143) సమావేశం నేడు కరీంనగర్ లోని టీఎన్ జీవో భవనం జరగనుంది. ఇందులో పాత్రికేయులతో ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ భేటి అవుతారు. ఇటీవల అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డులు, డబుల్ బెడ్ రూం ఇళ్లపై ప్రభుత్వం ఇచ్చిన హామీలు, అమలు తీరును చర్చిస్తారు..

కాగా మొదట కరీంనగర్ లోని ఆర్ అండ్ బీ అతిథి గృహానికి వచ్చే ఆయన విశ్రాంతి తీసుకొని ఆయన టీఎన్ జీవో భవన్ లో పాత్రికేయుల సమావేశంలో పాల్గొంటారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రకటన విడుదలైంది.

వినతి పత్రం ఇవ్వనున్న డెస్క్ జర్నలిస్టుల ఫోరం

జర్నలిస్టులతో పాటు డెస్క్ లో పనిచేసే సబ్ ఎడిటర్లకు కూడా అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డులు, డబుల్ బెడ్ రూం ఇల్లను కేటాయించాలని డిమాండ్ తో ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణకు ఈరోజు డెస్క్ జర్నలిస్ట్ ఫోరం కరీంనగర్ సభ్యులు వినతిపత్రం ఇవ్వనున్నారు. ఈ మేరకు నిర్ణయించినట్టు ఫోరం సభ్యులు తెలిపారు.

About The Author

Related posts