Breaking News

కరీంనగర్ లో డెస్క్ జర్నలిస్టుల ఫోరం ఆవిర్భావం

knr

కరీంనగర్ : హక్కుల సాధన కోసం సబ్ ఎడిటర్లు డెస్క్ జర్నలిస్టుల ఫోరం(డీజేఎఫ్) గా ఏర్పడ్డారు. డీజేఎఫ్ కరీంనగర్ జిల్లా శాఖ సమావేశాన్ని నగరంలోని ఉజ్వల పార్క్ సమీపంలో గల యాదవ సంఘ భవనంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పత్రికలకు చెందిన 12మంది సబ్ ఎడిటర్లతో స్టీరింగ్ కమిటీని ఎన్నుకున్నారు. సబ్ ఎడిటర్లందరికీ అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డులు, నివేశనస్థలాలు, డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. స్టీరింగ్ కమిటీ సభ్యులుగా పోలు సంపత్, మంద మధుసూదన్, నోముల రవీందర్ రెడ్డి, గుర్రాల మహేశ్(సాక్షి), రామగిరి కిరణ్ కుమార్, బాడిశె సంపత్ కుమార్ , దుబ్బాక శ్రీనివాస్, గొట్టెముక్కల బ్రహ్మచారి(నమస్తే తెలంగాణ), వంగ అజయ్ యాదవ్, వెంకటరెడ్డి (ఆంధ్రజ్యోతి), చంద్రమోహన్ (ఆంధ్రప్రభ), బండోజు శ్రీకాంత్(నవ తెలంగాణ) ను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో ఆయా పత్రికల ఎడిషన్ ఇన్ చార్జీలు, సబ్ ఎడిటర్లు పాల్గొన్నారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *