కరీంనగర్ లో జోయాలుక్కాస్ షోరూం ప్రారంభం

కరీంనగర్ : అంతర్జాతీయ జూవెల్లరీ దిగ్గజం.. జోయాలుక్కాస్ కరీంనగర్ తన షోరూంను శనివారం ప్రారంభించింది. కరీంనగర్ మేయర్ రవీందర్ సింగ్, డీఎస్సీ రామారావు, జోయాలుక్కాస్ డైరెక్టర్ లు జాన్ పాల్ జోయాలుక్కాస్ , సోనియా జాన్ పాల్, మేనేజర్ దేవదాసుల చేతులగా షోరూం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా  డైరెక్టర్ జాన్ పాల్ జోయాలుక్కాస్ మాట్లాడుతూ కరీంనగర్ లో షోరూం ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. కరీంనగర్ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించాలని విన్నవించారు.. తెలంగాణలో 5 వ షోరూం కరీంనగర్ లో ప్రారంభించామన్నారు. కొత్తకొత్త డిజైన్లతో సాధారణ ప్రజలకు సైతం అందుబాటులో ధరల్లో నగలు షోరూంలో ఉన్నాయని.. క్వాలిటీ, క్వాంటటీలో తేడా లేకుండా తక్కువ ధరల్లో లభ్యమవుతాయన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మేనేజర్ దేవదాసు మాట్లాడుతూ పెళ్లిళ్లు, పెరాంటాలకు ఇక హైదరాబాద్ లాంటి మెట్రో నగరాలకు వెళ్లి నగలు కొనుక్కోవాల్సిన అవసరం లేదని.. అన్ని వెరైటీలతో నగలు కరీంనగర్ జోయాలుక్కాస్ లో ఉన్నాయన్నారు.

మేయర్ రవీందర్ సింగ్, డీఎస్పీ రామారావులు మాట్లాడుతూ కరీంనగర్ లో ఇలాంటి అత్యుత్తమ సంస్థలు స్థాపించడం వల్ల నగరం మరింతగా అభివృద్ధి చెందుతుందన్నారు. జోయాలుక్కాస్ సంస్థకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *