కరీంనగర్ లో చిన్న పత్రికల ధర్నా

కరీంనగర్ లో చిన్న పత్రికల ధర్నా

చిన్న పత్రికల్లో పనిచేసే జర్నలిస్టులందరికి అక్రిడిడేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రువారం నాడు జర్నలిస్టు లు కరీంనగర్ లో ధర్నా, రాష్ట్ర్రారోకో చేసారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైతే స్ధానిక పత్రికలకు, చిన్న పత్రికలకు మేలు జరుగుతుందని భావించారని కాని జర్నలిస్టలకు మరింత అన్యాయం జరుగుతుందని జర్నలిస్టుల సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు జోక్యం చేసుకుని చిన్న పత్రికలలో పని చేసే జర్నలిస్టులకు అన్యాయం జరగకుండా చూడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజె(ఐజెయు) జిల్లా అధ్యక్షులు తాడూరి కరుణాకర్, జిల్లా కార్యదర్శి గానుల శ్రీనివాస్, రాష్ట్ర్ర కార్యవర్గ సభ్యులు బి. విజయ్ సింహరావు, తెలంగాణ చిన్న పత్రికల సంఘం అధ్యక్షులు మహ్మద్ ఇమ్రాన్, తెలంగాణ ఆన్ లైన్ మీడియా జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర్ర కార్యదర్శి ప్రభుదాస్, ఐజెయు జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎలగందుల రవీందర్, జర్నలిస్టుల సంఘాల నాయకులు రవీంద్రాచారి, తిరుమల్ బిజిగిరి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. టియుడబ్ల్యూజె స్టేట్ కౌన్సిల్ సభ్యులు డి. జగన్మోహన్, నాయకులు మొగురం రమేష్, జేరిపోతుల సంపత్, మంతిని రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
చిన్న పత్రికల జర్నలిస్టుల ఉద్యమానికి టోమ్జా మద్దతు:
అక్రిడిడేషన్ కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేస్లూ చిన్న పత్రికల జర్నలిస్టులు చేస్తున్న ఉద్యమానికి తెలంగాణ ఆన్ లైన్ మీడియా జర్నలిస్టుల వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర్ర అధ్యక్షులు అయిలు రమేష్, ప్రధాన కార్యదర్శి కళ్యాణం శ్రీనివాస్, ఉపాధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, శ్యాం మోహన్, ఎమ్.ఎస్. శంకర్, వేముల సదానందం,  రాష్ట్ర్ర కార్యదర్శి ఎ. రాజేష్, కోశాధికారి, కనకదుర్గ, నాయకులు శంకర్ గౌడ్, కోడం సంతోష్ లు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. తెలంగాణ లో చిన్న పత్రికలలో పని చేసే జర్నలిస్టులందరికి సత్వరమే అక్రిడిడేషన్ లు జారీ చేయాలని వీరు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *