
ఉల్లి ధర పెరిగి కొండెక్కి కూర్చుంది.. కిందకు దిగిరానంటోంది.. ఉల్లి ధరల అదుపే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో మార్కెట్లలో సబ్సిడీ ధరకే కిలో 20కే అందిస్తోంది.. దీంతో ఈ ఉల్లి కోసం జిల్లాల్లో లొల్లి మొదలైంది.. భారీగా క్యూలో నిలబడుతూ.. ఎండలో ఊసురుమంటూ కిలో 20 ఉల్లిగడ్డలను కొనుగోలు చేస్తున్నారు. ఎన్ని రోజులైనా ఉల్లికి డిమాండ్ తగ్గకపోవడంతో ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సబ్సిడీ ఉల్లిని కర్నూల్ మార్కెట్ నుంచి తెప్పిస్తోంది.. ఇప్పటికే 20 కోట్లను సబ్సిడీ ఉల్లిపై ప్రభుత్వం చెల్లించింది.
కాగా కరీంనగర్ లోని రైతు బజార్ మార్కెట్ లో ఉల్లికి డిమాండ్ కొనసాగుతోంది. మనిషి 2 కిలోలను 20కి కిలో చొప్పున అందిస్తుండడంతో జనం ఎగబడుతున్నారు. ఇన్ని రోజులైన ఉదయం 9 గంటలకే బారెడు క్యూ ఉంటోంది. జిల్లా వ్యాప్తంగా ప్రతి పట్టణానికి ఉల్లి కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఉల్లి బాధలు జనాలకు తగ్గే అవకాశం ఉంది..