Breaking News

‘కరీంనగర్’ లాబీయింగ్ ఫలించింది.. ఆరేపల్లికి పదవొచ్చింది..

KNKMDHI-W125_GCU4A7_928985e

తెలంగాణ రాష్ట్ర పీసీసీలో కరీంనగర్ నాయకుల హవా కొనసాగుతోంది.. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగిన మంత్రి శ్రీధర్ బాబు హవా అప్పుడు కిరణ్ ప్రభుత్వంలో నడిచింది.. ఇప్పుడు ప్రతిపక్షంగా మారిన తెలంగాణ కాంగ్రెస్ లో కూడా ఆయన కొనసాగుతోంది..ఈయనే కాదు ఇప్పుడు జగిత్యాల ఎమ్మెల్యే, ప్రస్తుత శాసనసభా పక్ష ఉపనేత జీవన్ రెడ్డి సైతం కీరోల్ వహిస్తున్నారు. వీరే కాక కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు కటకం మృత్యుంజయం, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, వివేక్ లు గట్టి లీడర్లు కావడంతో వీరు చెప్పిందే ప్రస్తుతం తెలంగాణ పీసీసీలో, ఢిల్లీలో నడుస్తోంది. అందుకే ఇప్పుడు వీరు చెప్పిన వారికి పదవులొస్తున్నాయి..

నిన్న తెలంగాణ పీసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా ఆరేపల్లి మోహన్ నియామకం కూడా శ్రీధర్ బాబు చొరవవల్లే దక్కింది. అప్పట్లో ఆయన కిరణ్ సర్కారులో కిరణ్ కు రైట్ హ్యాండ్ వలే ఉంటూ ఆరేపల్లికి కీలకమైన ప్రభుత్వ విప్ పదవి ఎస్సీ కోటాలో ఇప్పించారు. ఇప్పుడు కూడా ఎస్సీ కోటాలోనే ఎస్సీ సెల్ అధ్యక్ష పదవి ఇచ్చారు. శ్రీధర్ ప్రస్తుతం నారాయణ్ ఖేడ్ ప్రచారంలో బిజీగా ఉన్నారు.. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి కి బాగా సన్నిహితుడు కావడం.. కాంగ్రెస్ లో అన్నీ తానై వ్యవహారాలు చక్కబెడుతుండడంతో ప్రస్తుతం శ్రీధర్ బాబు హవా కొనసాగుతోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *