Breaking News

కరీంనగర్ లక్ష్మీనగర్ లో ఉన్మాది వీరంగం, 20మందికి గాయాలు

Photo1541

-ఉన్మాదిపై కాల్పులు జరిపిన పోలీసులు -చికిత్స పొందుతూ మృతి
కరీంనగర్ : కరీంనగర్ లోని లక్ష్మీనగర్ లో సైకో వీరంగం సృష్టించాడు.. లక్ష్మీనగర్ కు చెందిన బల్వీందర్ సింగ్ మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఇంట్లో గొడవపడి తల్వార్ తో ఇంట్లో అమ్మానాన్నపై దాడి చేశాడు. ఈ ఘటనలో అమ్మకు తీవ్రగాయాలు కాగా.. తండ్రికూడా గాయపడ్డాడు. అనంతరం సైకో లక్ష్మీనగర్ లోని వీధుల్లోకి వచ్చి ఎవరు కనపడితే వారిపై దాడి చేశాడు. వాహనాల అద్దాలు ధ్వంసం చేశారు. అడ్డుకున్న ఆటో డ్రైవర్ చేయిపై దాడి చేయగా అతడికి తీవ్ర గాయాలయ్యాయి..

సైకో అద్దెకున్న ఇంట్లో పోలీసుల విచారణ

సైకో అద్దెకున్న ఇంట్లో పోలీసుల విచారణ

విషయం తెలుసుకున్న కరీంనగర్ వన్ టౌన్ హెడ్ కానిస్టేబుల్ అలీ సిబ్బందితో వచ్చి సైకోను అదుపుచేసే ప్రయత్నం చేయగా వారిపై కూడా దాడి చేశాడు.. అలీపై దాడి చేసిన సైకో అతని చేతి వేలు నరికేశాడు.. ఘటన స్థలానికి చేరుకున్న వన్ టౌన్ సీఐ విజయసారథి సైకో కాళ్లపై కాల్పులు జరిపాడు. ఒక బులెట్ కడుపులోకి దూసుకుపోయింది.. వెంటనే హెడ్ కానిస్టేబుల్ ను 20 మంది బాధితులను, సైకోను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సైకో మృతిచెందాడు..

దాదాపు అరగంట పాటు లక్ష్మీనగర్ లో కత్తితో హల్ చేస్తూ సైకో సంచరించడంతో కాలనీవాసులు తలుపులు మూసుకొని బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. వీధుల వెంట పరిగెత్తుతూ సైకో ఏది కనపడితే దానిని ధ్వంసం చేస్తూ హల్ చల్ చేశాడు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *