
కరీంనగర్ లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. ఈ నెలలో వరసగా ప్రమాదాలు ఎక్కువయ్యాయి. యువత ఎక్కువగా ప్రమాదాల బారిన పడుతున్నారు. డిగ్రీ, పీజీ, ఎంబీబీఎస్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మృత్యువాత పడుతున్నారు. వారి తల్లిదండ్రులు పిల్లల గారాభాన్ని ఆసరాగా చేసుకొని వారికి కార్లు, సూపర్ బైక్ లు కొనిచ్చి వారిని చెడగొడుతున్నారు. కొత్త వాహనాల మోజు వారు స్పీడుగా వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇటీవల కరీంనగర్ ప్రతిమ మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ కొత్తగా తల్లిదండ్రులు కొనిచ్చిన కారులో బయలు దేరి వేగంగా ఆర్టీసీ బస్సును ఢీకొట్టారు. ఈ ప్రమాదంతో నలుగురు అద్భుత ప్రతిభ ఉన్న విద్యార్థులు అక్కడికక్కడే చనిపోయారు.
ప్రతిమ మెడికల్ కాలేజీలో వైద్యవిద్యా రెండో సంవత్సరం చదువుతున్నారు. మృతిచెందిన వారిలో వరంగల్ జిల్లా పరకాల కు చెందిన చిరంజీవి నవకాంత్( 22), పెగడపల్లి మండలం ఢీకొండకు చెందిన గొర్రెనాని (నవీన్)22, మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేటకు చెందిన శకవత్ మహేశ్ నాయక్(22) హైదరాబాద్ జిల్లా బొడుప్పల్ కు చెందిన రాచూరి రాహుల్ లు ఉన్నారు.
ఆ ప్రమాదం జరిగిన సమయంలో తీసిన వీడియో ఇది..