కరీంనగర్ మొత్తాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి..

కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని కరీంనగర్ జడ్పీ సమావేశంలో సభ్యులు డిమాండ్ చేశారు.. శనివారం కరీంనగర్ జడ్పీ సమావేశం జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ అధ్యక్షతన కరీంనగర్ లో జరిగింది. కార్యక్రమానికి జగిత్యాల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సహా జిల్లాలోని జడ్పీటీసీ, ఎంపీపీలు, హాజరై తమ సమస్యలను ఏకరువు పెట్టారు.

సభలో జిల్లా అంతటిని కరువు ప్రాంతంగా ప్రకటించాలని కాటారం జడ్పీటీసీ నారాయణ రెడ్డి, చొప్పదండి ఎంపీపీ సాంబయ్య నినదించడంతో సభ్యులందరూ వారికి చప్పట్లతో అంగీకారం తెలిపారు. దీంతో జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ స్పందించి జిల్లా అంతటిని కరువు ప్రాంతంగా ప్రకటించాలని తీర్మానం చేద్దామని ప్రతిపాదించారు. దీంతో సమావేశం సజావుగా సాగింది..

ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, కరీంనగర్ ఎంపీపీ వాసాల రమేశ్, డీసీఎంఎస్ చైర్మన్ ముదుగంటి సురేందర్ రెడ్డి, ఎంపీపీ, జడ్పీటీసీలు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *