
ఈరోజు కరీంనగర్ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ గారు నగరంలో సుడిగాలి పర్యటించారు. ఈనెల పద్దెనిమిది తేదీన చేపట్టబోయే ఒక లక్ష మొక్కలు నాటే కార్యక్రమం పై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం కరీంనగరంలోని వివిధ ప్రాంతాలలో ద్విచాక్ర వాహనంపై నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి లక్ష మొక్కల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులు, ప్రజలకు సూచించారు.