కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ కు రెండు నెలల జైలు

హైదరాబాద్ : హైకోర్టు తీర్పును అమలు చేయడంలో విపలమైన కరీంనగర్ మున్సిపల్ చైర్మన్ రమణాచారికి రెండు నెలల జైలు శిక్షతో పాటు పదిహేను వందల రూపాయల జరిమానా విధిస్తూ  హైకోర్టు తీర్పునిచ్చింది.. ప్రభుత్వ న్యాయవాది అప్పీలును కోరగా తీర్పు అమలును నాలుగువారాలు నిలుపుదల చేశారు.

కరీంనగర్ కు చెందిన ఎస్. మణమ్మతో పాటు మరో ఇద్దరికి చెందిన స్థలం వ్యవహారంలో నూతన భూసేకరణ చట్టం  ప్రకారం చర్యలు చేపట్టి .. నిర్దిష్ట సమయంలో వారికి పరిహారం అందజేయాలని  మున్సిపల్ అధికారులను ఆదేశిస్తూ ఈ ఏడాది జనవరిలో హైకోర్టు తీర్పునిచ్చింది..

కోర్టు ఆదేశించినా  అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టలేదని పేర్కొంటూ పిటీషనర్లు కోర్టు ధిక్కార కేసు దాకలు చేశారు.  విచారణ జరిపిన న్యాయమూర్తి.. అప్పటి కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ ను బాధ్యుల్ని చేస్తూ రెండు నెలల జైలు శిక్ష విధించారు.

About The Author

Related posts