కరీంనగర్ ప్రెస్ భవన్ లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

00013

కరీంనగర్ : కరీంనగర్ ప్రెస్ భవన్ లో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ ఉదయం జరిగిన వేడుకలకు కరీంనగర్ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ రావు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి జర్నలిస్టులకు శుభాకాంక్షలు చెప్పారు. జర్నలిస్టులందరూ సుఖ సౌఖ్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

001232

ఈ వేడకల్లో టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్, తెలంగాణ ఆన్ లైన్ మీడియా జర్నలిస్టు అసోసియేషన్ (టోమ్జా) అధ్యక్షులు అయిలు రమేశ్, టీయూడబ్ల్యూజే కరీంనగర్ అధ్యక్ష, కార్యదర్శులు తాడూరి కరుణాకర్, గాండ్ల శ్రీనివాస్, ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎనగందుల రవీందర్, DPRO ప్రసాద్, ఆంధ్రప్రభ బ్యూరో చీఫ్ రాజశేఖర్, యూనియన్ నాయకులు చంద్రశేఖర్, శరత్ రావు, భవానీ ప్రసాద్, పామురాజు రామారావు, ఆంధ్రజ్యోతి స్టాఫ్ రిపోర్టర్ సంపత్, ఫొటో గ్రాఫర్స్ జిల్లా అసోసియేషన్ అద్యక్షులు షుకూర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బల్మూరి విజయసింహారావు, యూనియన్ నాయకులు జగన్, విజయేందర్ రెడ్డి, ఒంటెల క్రిష్ణ, సురేందర్ రెడ్డి, వై రాధాకృష్ణ ,ఆంధ్రజ్యోతి కరీంనగర్ ఎడిషన్ ఇన్ చార్జి జయంత్, సిటీకేబుల్ సత్యం, కోల తిరుపతి, దయాకర్, తోట వెంకటరమణ, పడకంటి రమేశ్, తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *