
ప్రపంచ ఫొటో గ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇవాళ కరీంనగర్ లోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించే ఫొటో గ్రఫీ దినోత్సవంలో తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు తాడూరి కరుణాకర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్టులు అయిలు రమేశ్, రవీందర్ తదితరులు పాల్గొననున్నారు..