
కార్పోరేట్ ఆసుపత్రి తరహలోకరీంనగర్ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఆవరణలో అత్యాధునిక సౌకర్యాలతో ఆధునీకరించబడిన యూనిట్ ఆసుపత్రిని సోమవారం నాడు జిల్లా ఎస్పీ
వి.శివకుమార్ ప్రారంభించారు. మల, మూత్ర, రక్త పరీక్షలకు సంబంధించిన లాబోరేటరీతోపాటు, ఐసియూ విభాగం, పురుషులు, మహిళలకు ప్రత్యేక వార్డులు, అవుట్ పేషెంట్
వార్డ్, డాక్టర్స్ రూం, డ్రెస్సింగ్ రూం, స్టోర్ రూంలతో ఈ యూనిట్ ఆసుపత్రిని ఆధునీకరించారు. ప్రతినిత్యం ముగ్గురు డాక్టర్లు అందుబాటులో ఉంటారు. ఇందులో ఒక
గైనకాలజిస్ట్ ఉన్నారు. జిల్లాలోని అన్ని స్ధాయిలకు చెందిన పోలీసులతో పాటు రిటైర్డ్ పోలీసు కుటుంబాలకు ఉచితంగా ఈ సౌకర్యాన్ని వినియోగించుకొనే అవకాశాన్ని
కల్పించడం జరిగింది. జిల్లాలోని ప్రతి పోలీసు, రిటైర్డ్ పోలీసు కుటుంబాలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ వి.శివకుమార్ అన్నారు. పోలీసులకు
భవిష్యత్ లో మరిన్ని అత్యాధునిక వైద్య సౌకర్యాలను కల్పించనున్నామని పేర్కొన్నారు. యూనిట్ ఆసుపత్రిని అత్యాధునికంగా తీర్చిదిద్దేందుకు సహకరించిన వైద్యులు
యాకయ్య, శ్రీకాంత్ రెడ్డి, సురేష్ రెడ్డి, ప్రదీప్ కుమార్, ఎల్.రామిరెడ్డి, కైలాస్ పబ్బా, బంగారు స్వామి, శ్రీదేవిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ.
బి.జనార్ధన్ రెడ్డి, ఎఆర్ డిఎస్పీ కోటేశ్వరరావు, ఆసుపత్రి వైద్యులు నరేందర్ రావు, ఉషారాణి, నిఖిత్ పర్వీన్, ఆర్.ఐలు గంగాధర్, శశిధర్, యాకుబ్ రెడ్డి, ఆర్.ఎస్.ఐలు
చంద్రశేఖర్, నవీన్, స్వామి, జిల్లా పోలీసు అధికారుల అసోసియేషన్ అధ్యక్షులు యం.సురేందర్, రాష్ట్ర్ర కార్యవర్గ సభ్యులు ఎస్.రవికాంత్, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస్
తదితరులు పాల్గొన్నారు.