
సంక్షేమ కార్యక్రమాల అమల్లో కరీంనగర్ పోలీస్ శాఖ నెంబర్ వన్ నిలుస్తోవదని వరంగల్ రేంజ్ డిఐజి బి. మల్లారెడ్డి కొనియాడారు.
కరీంనగర్ జిల్లా సోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జాన్ విల్సన్ స్మారక ఓపెన్ ఎయిర్ థియేటర్ ను గురువారం ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా డిఐజి మల్లారెడ్డి మాట్లాడుతూ రేంజ్ పరిధిలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ ల్లో కరీంనగర్ సర్వాంగ సుందరంగా ఉందని కితాబిచ్చారు.
శాంతి భద్రతల పరిరక్షణలో సమిష్టి గా పనిచేస్తూ నెంబర్ వన్ గా నిలుస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ జోయల్ డేవిడ్, అదనపు ఎస్పీ అన్నపూర్ణ, ఓఎస్ డి సుబ్బరాయుడు, ట్రయినీ ఐపీఎస్ అధికారిణి సింధూశర్మ, ఎస్ బి డీఎస్పీ ప్రభాకర్, కరీంనగర్ డీఎస్పీ రామారావు, ఏ ఆర్ డీఎస్పీ కోటేశ్వర్ రావు, ఆర్ ఐ లు గంగాధర్, శశిధర్, సిఐ లు విజయసారథి, హరిప్రసాద్, సదానందం, క్రిష్ణగౌడ్, మహేష్,నారాయణ తదితరులు పాల్గోన్నారు.