
కరీంనగర్ పోలీసులు రెండో రోజు సైతం డేగ కన్నుతో 20మంది మందు బాబులను పట్టుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మందు కొట్టే మందుబాబుల గుండెల్లో గుబులు రేపుతున్నారు కరీంనగర్ పోలీసులు. నిరంతరం డ్రోన్ కెమెరాలతో వేట కొనసాగించేందుకు సిద్దంగా ఉన్నారు కరీంనగర్ పోలీసులు. పోెలీసులా మజాకా….
కరీంనగర్ లోని ప్రముఖ సందర్శన ప్రాంతాలు, శివారు ప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం వివిధ రకాల అసాంఘీక, అక్రమ కార్యకలాపాల నియంత్రణ కోసం వినియోగిస్తున్న డ్రోన్ కెమెరాలు అప్రతిహతంగా ఫలితాలనిస్తున్నాయి. తాజాగా శుక్రువారం నాడు మానేరుడ్యాం శివారు ప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న 20మంది మందుబాబులను అరెస్టు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రువారం సాయంత్రం మానేరుడ్యాం శివారు ప్రాంతం, చింతకుంట శివారు ప్రాంతాల్లో పోలీసులు డ్రోన్ ను ప్రయోగించారు. డ్రోన్ కెమెరాల ద్వారా అందిన ఛాయాచిత్రాల ఆధారంగా సదరు ప్రాంతంలో పోలీసులు మెరుపుదాడి జరిపి మందుబాబులను అరెస్టు చేశారు. అరెస్ట్తె మందుబాబుల వివరాలు ఇలా ఉన్నాయి. ఇందుర్తికి చెందిన సిహెచ శ్రీనివాస్, గుడ్డేలుగులపల్లికి చెందిన జి. మల్లయ్య, శంకరపట్నంనకు చెందిన యం. లక్ష్మన్, కట్టరాంపూర్ కు చెందిన ఆర్ సురేష్, కె. వెంకన్న, కె. ఉప్పలయ్య కె. మధు, గోవిందపల్లికి చెందిన యం సామ్రాట్, బెల్లంపల్లికి చెందిన యం శ్రీహరి, ముకరంపురకు చెందిన యండి అప్జల్, రేణికుంటకు చెందిన సిహెచ్ శ్రీకాంత్, యం రమేష్, బొమ్మకల్ కు చెందిన ఎస్ కిశోర్, సూరారంకు చెందిన పి. మహేష్, మొలంగూరుకు చెందిన ఎ కమలహసన్, డి జీవన్, పెగడపల్లికి చెందిన సిహెచ్ రమేష్, పెద్దాపూర్ కు చెందిన పి రమేష్, కొత్తూరుకు చెందిన పి శ్రీనివాస్, రుక్మాపూర్ కు చెందిన జి. సురేష్ లను అరెస్టు చేశారు. మందుబాబులపై కరీంనగర్ వన్ టౌన్, కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదయ్యాయి. వీరి వద్ద నుండి ఆరు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.