కరీంనగర్ ను స్మార్ట్ సిటీ గా చేసేందుకు కృషి చేస్తా: సాగర్ జీ

కరీంనగర్ ను స్మార్ట్ సిటీ గా చేసేందుకు కృషి చేస్తానని మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు అన్నారు. శనివారం నాడు కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ లో స్థానిక నేతలు సాగర్ జీ ని సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనుల  విషయంలో కరీంనగర్ ప్రజలు తనకు విన్నవించడం కాదు వారికి తనను శాసించే అధికారం ఉందన్నారు. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలను కలిపే కాలేశ్వరం బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావస్తుందని, ఆగస్టులో ప్రారంభమై రెండు రాష్ట్రాలకు రాకపోకలు కొనసాగుతాయన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్,  ఎంపీ వినోద్ కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ , ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ భాను ప్రసాదరావు, మేయర్ రవీందర్ సింగ్, జడ్పీ ఛైర్పర్సన్ తుల ఉమ, డిప్యూటి మేయర్ గుగ్గిలపు రమేష్, ఈద శంకర్ రెడ్డి, ఎడ్ల అశోక్, వై. సునీల్ రావు, రూప్ సింగ్, కోడూరి రవీందర్ గౌడ్, మున్సిపల్ కమీషనర్ రమణా చారి తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *