కరీంనగర్ డైరీ పనితీరును ప్రశంసించిన తలసాని

కరీంనగర్: కరీంనగర్ డైరీ పనితీరు బాగుందని రాష్ట్ర్ర పశుసంవర్ధక, డైరీ, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం కరీంనగర్ డైరీని ఆయన సందర్శించారు. డైరీ పనితీరును పరిశీలించారు. కరీంనగర్ డైరీ రాష్ట్ర్రంలోని ఇతర పాల ఉత్పత్తి కేంద్రాలకు ఆదర్శంగా ఉందని అన్నారు. డైరీ పాలనాధికారులు రైతుల కొరకు, పశువుల సంక్షేమం కోసం ఇప్పుడు అమలు చేస్తున్న పధకాలు బాగున్నాయని అన్నారు. ఈ సంక్షేమ కార్యక్రమాలను ఇంకా పెద్ద ఎత్తున చేపట్టాలని సూచించారు. అంతే కాకుండా రైతులు లబ్ది పొందే విధంగా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ధిక పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ డైరీలు తమ లాభాల గురించి ఆలోచించడమే కాకుండా రైతుల సంక్షేమానికి కూడా ఆలోచించాలని అన్నారు. రైతులు ఆర్ధికంగా బాగుగా ఉన్నప్పుడే డైరీలకు ఆదాయం సమకూరుతుందని అన్నారు. రైతు కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు పాల ఉత్పత్తే అని తెలిపారు. కరీంనగర్ డైరీ చైర్మన్ సి.హెచ్. రాజేశ్వర్ రావు డైరీ పనితీరు గురించి వివరించారు. డైరీ వార్షిక టర్నోవర్ 2.13 కోట్లకు చేరుకుందని తెలిపారు. ప్రతిరోజు సరాసరి 1,505 లీటర్ల పాలను వినియోగ దారులకు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. 767 పాల ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. 66 వేల కుటుంబాలు ప్రతిరోజు పాలను కేంద్రానికి సరఫరా చేస్తున్నారని తెలిపారు. జగిత్యాల, అగ్రహరం, జమ్మికుంట, హుస్నాబాద్ లలో పాల శీతలీకరణ కేంద్రాలు ఉన్నట్లు తెలిపారు. రైతులకు, పశువుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.

EATELA RAJENDER

చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తాం: జిల్లాలో చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తామని రాష్ట్ర్ర మత్స్య శాఖ మంత్రి శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం ఎల్.ఎం.డి.లో కేజి కల్చర్ ను పరిశీలించారు. అనంతరం చేప పిల్లల పెంపకం కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మత్స్య సంపద వృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. అందులో భాగంగానే కేజి కల్చరును ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. దీని వలన మత్స్య సహకార సంఘాలు ఆర్ధిక పరిపుష్టి చేకూరుతుందని అన్నారు. గత ప్రభుత్వంలో ఒక కోటి లేదా 2 కోట్ల రూపాయలు బడ్జెటు కేటాయించే వారని తెలిపారు. తమ ప్రభుత్వం మత్స్య పరిశ్రమను ప్రోత్సహించాలనే లక్ష్యంతో 100 కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, సాంస్కృతిక సారధి రసమయి బాలకిషన్, ఎమ్మెల్యేలు పుట్ట మధు, బొడిగె శోభ, జిల్లా మత్స్య సహకార సంఘం చైర్మన్ లక్ష్మణ్, పశు సంవర్ధక శాఖ జెడి రామచందర్ రావు, కరీంనగర్ ఆర్డీఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

TALASANI EATELA     TALASANI YADAV.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *