
కరీంనగర్ : కరీంనగర్ కలెక్టర్ నీతూ ప్రసాద్.. నగరంలోని కరీంనగర్ డెయిరీని పరిశీలించారు. అందులోని పాలు, పెరుగు మజ్జిగ ప్యాకెట్ల తయారీని పరిశీలించారు.
అనంతరం పశువులకు ఇచ్చే దానాను, ప్యాకింగ్ తయారీని అడిగి తెలుసుకున్నారు. పచ్చదనం, పరిశుభ్రత పాటించాలని సూచించారు. కరీంనగర్ డెయిరీ చైర్మన్ రాజేశ్వరరావు, ప్లాంట్ అధికారులు, కలెక్టర్ కంపెనీ గురించి సమావేశంలో వివరించారు.