కరీంనగర్ జిల్లాలో రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని ట్రాన్స్ కో అధికారులు పేర్కొన్నారు. 400 కే.వీ విద్యుత్ లైన్లలో మరమ్మతులు కారణంగా మానకొండూర్, హుజూరాబాద్, హుస్నాబాద్ ప్రాంతాలతో పాటు మిగితా ప్రాంతాల్లో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని వారు ప్రకటించారు. కాగా వినియోగదారులు సహకరించి తాగునీటి, సాగునీటి ఇబ్బందులను ముందే పరిష్కరించుకోవాలని సూచించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *