కరీంనగర్ జిల్లాలో బాలికను కట్టేసి రేప్..

కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం గాగిళ్లాపూర్ లో దారుణం జరిగింది. 8వ తరగతి చదువుతున్న మైనర్ స్యూల్ విద్యార్థినిని అదే తరగతి చదవుతున్న బాలుడు అత్యాచారం చేశాడు. బాలిక బయటకు వెళ్లగా వెంబడించి నోట్లో గుడ్డలు కుక్కి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి చేతులు వెనక్కి కట్టి బాలికపై రాత్రంతా అత్యాచారం చేశాడు. వేకువజామున తప్పించుకొని వచ్చిన బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వెలుగుచూసింది.

బాలిక తల్లిదండ్రులు బాలుడి తల్లిదండ్రులను ప్రశ్నించగా బాలుడు పారిపోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. బాలిక, బాలుడు ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *