కరీంనగర్ జిల్లాలో ఈనెలలో భారీగా రేషన్ కార్డుల కోత

కరీంనగర్ : కరీంనగర్ జిల్లా నుంచి స్వయంగా పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఈటెల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయినా పేదలకు రేషన్ కార్డుల తిప్పలు తప్పడం లేదు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచి రేషన్ కార్డుల కోసం జనం రోడ్ల మీదకు వస్తూనే ఉన్నారు. మొదట సమగ్ర సర్వే అంటూ కాలయాపన.. ఆ తర్వాత దరఖాస్తులు, వడపోతలు పూర్తయి కొద్దినెలలుగా అందరికీ రేషన్ కార్డులు అందుతున్నాయి..

కాగా ఈ ఏప్రిల్ నెలలో జిల్లా వ్యాప్తంగా కొత్త గా మంజూరు చేసిన రేషన్ కార్డులను తొలగించారు. ఈ నెలకు వారి రేషన్ బియ్యం రాలేదు. దీంతో ప్రజలు మండలాఫీసులకు పరుగులు తీస్తున్నారు. వీఆర్వోలు, ఎమ్మార్వోలు ఎవరూ కూడా దీనిపై స్పష్టత ఇవ్వడం లేదు.. స్వయంగా మంత్రి జిల్లాలోనే వేల సంఖ్యలో రేషన్ కార్డులు రద్దు కావడం ఆందోళనకు గురిచేస్తోంది.

మరో వైపు బంగారు తెలంగాణ అంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని.. తెలంగాణ బంగారు తెలంగాణ కాకున్న ఫరవలేదని.. తమకు ఓ రేషన్ కార్డు ఇవ్వండి చాలు అంటూ జనం అధికారులు, ప్రభుత్వంపై మండిపడుతున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *