కరీంనగర్ జడ్పీ సభ నుంచి కాంగ్రేస్ సభ్యుల సస్పెన్షన్

కరీంనగర్: స్ధానిక సంస్ధలకు నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ జెడ్పీ సమావేశంలో నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ జెడ్పీ టిసి సభ్యులు నారాయణ రెడ్డి, దివ్య, మాధవి, శోభలతో పాటు పలువురు సభ్యులను జెడ్పీ ఛైర్మన్ తుల ఉమ సస్పెండ్ చేశారు. కరీంనగర్ జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం ఆదివారం ఉదయం 11 గంటలకు కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రారంభమైంది.
ఈ సమావేశంలో కరీంనగర్, సిరిసిల్లా, జగిత్యాలా, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ అర్బన్, సిద్దిపేట జిల్లా అధికారులు జెడ్పీ టిసి సభ్యులు, మండల పరిషత్ అధ్యక్షులు పాల్గొన్నారు. జెడ్పీ ఛైర్ పర్సన్ తుల ఉమ ప్రారంభ ఉపన్యాసం చేస్తూ పరిపాలనా సౌలభ్యం కోసం ముఖ్యమంత్ర కెసీఆర్ నూతన జిల్లాలు ఏర్పాటు చేశారని దీనివల్ల త్వరితంగా అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. సభ జరుగుతుండగానే కాంగ్రేస్ పార్టీకి చెందిన కాటారం జెడ్పీ టిసి సభ్యులు నారాయణ రెడ్డి నేతృత్వంలో సభలో ప్రవేశించి పోడియం వద్ద భైటాయించారు. రెండున్నరేళ్ళుగా జెడ్పీలకు నిధులు మంజూరు చేయలేదని, వెంటనే నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. పోడియం వద్ద నుంచి వెళ్లి తమ తమ సీట్లలో కూర్చోవాలని జెడ్పీ ఛైర్ పర్సన్ తుల ఉమ కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్, మంధని శాసన సభ్యులు పుట్ట మధు లు కోరినప్పటికి కాంగ్రెస్ సభ్యులు వినకపోవటంతో వారిని జెడ్పీ ఛైర్మన్ తుల ఉమ సభ నుండి సస్పెన్స్ చేశారు. అయినప్పటికి వారు అక్కడ నుంచి కదలకపోవటంతో పోలీసులు జోక్యం చేసుకుని కాంగ్రెస్ సభ్యులను బయటకు లాక్కెళ్లారు. అనంతరం సభ తిరిగి ప్రారంభమైంది. ఈ సమావేశంలో రామగుండం ఎమ్మెల్యే, ఆర్టీసీ ఛైర్మన్ సోమారపు సత్యన్నారాయణ, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, సుధాకర్ రెడ్డి, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు బాల్క సుమన్, హుస్నాబాద్ ఎమ్మెల్యే, ఒడిదల సతీష్ కుమార్, కరీంనగర్ కలెక్టర్, సర్పరాజ్ అహ్మద్, సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, జగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్, కరీంనగర్ జెడ్పీ సీఓ పద్మజ, జెడ్పీ టిసి సభ్యులు, విప్పనపల్లి సాంబయ్య, శరత్ రావు, సిద్దం వేణు, నారా బ్రహ్మయ్య, కరీంనగర్ మండల పరిషత్ అధ్యక్షులు వాసాల రమేష్, గంగాధర మండల పరిషత్ అధ్యక్షులు, దూలం బాల గౌడ్, డి.సి.ఎం.ఎస్ ఛైర్మన్ ముదుగంటి సురేందర్ రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి తో పాటు పలువురు జెడ్పీ టిసిలు, మండల పరిషత్ అధ్యక్షులు, ఏడు జిల్లాలకు చెందిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

gangula-kamalakar     thula-uma     thula-uma1     congrese

 

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.