
సీనియర్ జర్నలిస్ట్, రచయిత అయిలు రమేష్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన “యూట్యూబ్ స్టార్” లఘు చిత్రం ముంబైలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శింపబడింది .ఇండియా ఫిలిం ప్రాజెక్టు సీజన్ నైన్ అనే సంస్థ అంతర్జాతీయ స్థాయిలో 50 అవర్స్ ఫిల్మ్ మేకింగ్ చాలెంజ్ నిర్వహించింది. ఈ ఛాలెంజ్ కోసం 14 దేశాలు, 320 పట్టణాలనుండి 35000 ఎంట్రీలు రాగా ,1680 ఫిల్మ్ మేకర్ లు మాత్రమే 50 గంటల్లో షార్ట్ ఫిలిం నిర్మించి ఈ చాలెంజ్ లో విజయం సాధించారు .అందులో అయిలు రమేష్ “యూట్యూబ్ స్టార్ ” అనే షార్ట్ ఫిలిం 49 గంటల్లో నిర్మించి అర్హత సాధించడమే కాకుండా టాప్ ఫిఫ్టీ చిత్రాల్లో ఒకటిగా నిలిచి అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శింపబడింది. ఈనెల 12 13 తేదీల్లో ముంబైలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కు రచయిత, నిర్మాత ,దర్శకులు అయిలు రమేష్ తో పాటు నటుడు సుమన్ గౌడ్, కెమెరామెన్ కిషన్ నునుగొండ లు హాజరయ్యారు . నసీరుద్దీన్ షా , మనోజ్ బాజ్పాయ్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు అయిలు రమేష్ ను అభినందించారు. ఇప్పటివరకు “హౌస్ వైఫ్” “యాది కొస్తున్నాయి “లేజీ ఫెలో “అంతేగా అంతేగా ” బిల్డప్ రాజా” శంకర్ మామ టెన్త్ ఫెయిల్ “యూట్యూబ్ స్టార్” లాంటి లఘు చిత్రాలను అయిలు రమేష్ నిర్మించి దర్శకత్వం వహించారు .రాష్ట్ర ప్రభుత్వ భాష సాంస్కృతిక శాఖ నిర్వహించిన 48 అవర్స్ ఫిల్మ్ మేకింగ్ ఛాలెంజ్ లో కూడా అయిలు రమేష్ పాల్గొన్నారు .”యాది కొస్తున్నాయి “అనే చిత్రాన్ని 26 గంటల్లోనే నిర్మించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రవీంద్రభారతిలో “యాది కొస్తున్నాయి” లఘుచిత్రం ప్రదర్శింపబడింది .నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కు ఎంపికైన “యూట్యూబ్ స్టార్ట్ “చిత్రంలో సుమన్ గౌడ్ , సాయి కిషోర్, ప్రియా, సీతామాలక్ష్మి, కిషన్ , అశోక్, శ్రీనివాస్ ,లోకేష్ తదితరులు నటించారు ఈ చిత్రానికి కెమెరా కిషన్ నును గొండ ,ఎడిటింగ్ రాము మొగిలోజి, మేకప్ అశోక్ శ్రీరామోజు ,నిర్మాత” అయిలూస్ మీడియా హౌస్ ” కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అయిలు రమేష్.