Breaking News

కరీంనగర్ కార్పొరేషన్ లో చెప్పులు చూయించుకున్న కార్పొరేటర్లు

carop

అధికార టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు మేయర్ సమక్షంలోనే చెప్పులు చూపించుకుంటూ తగవులాడుకున్నారు.. కరీంనగర్ నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది.. మేయర్ రవీందర్ సాక్షిగా 23వ డివిజన్ కార్పొరేటర్ తాటి ప్రభావతి, 4వ డివిజన్ కార్పొరేటర్ ఎడ్ల సరిత తీవ్రంగా వాగ్వాదం చేసుకొని తగవులాడుకున్నారు. ఈ నేపత్యంలోనే కొర్పొరేటర్ ప్రభావతి చెప్పు చూపడం తీవ్ర దుమారం రేపింది.. దీంతో సభ మొత్తం అదుపుతప్పింది.. గందరగోళంతో సభను రెండు గంటలపాటు వాయిదా వేశారు.

తర్వాత సమావేశం ప్రారంభమైన తరువాత ప్రభావతి తనను దూషించిన సరితపై చర్య తీసుకోవాలంటూ మైక్ వైరును మెడకు చుట్టుకొని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. దీంతో సభను వాయిదా వేస్తూ మేయర్ నిర్ణయం తీసుకున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *